Breaking News

Breaking

అయోధ్యలో రామ మందిర భూమి పూజ వేడుకకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ


అయోధ్యలో రామ మందిర భూమి పూజ వేడుకకు అందరూ సన్నద్ధమయ్యారు. బుధవారం నాడు జరగనున్న భూమి పూజ వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో పాటు మరికొంత మంది ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రధాని బుధవారం నాడు ఢిల్లీ నుంచి బయలుదేరి రెండు గంటల పాటు అయోధ్య భూమి పూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు. బుధవారం నాడు మోదీ ప్రత్యేక జెట్‌లో ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరతారు. 10.40 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో మోదీ అయోధ్యకు బయలు దేరతారు. 11.30లకు ఆయన అయోధ్య చేరుకుంటారు. 11:40 గంటలకు హనుమాన్‌గడి ఆలయంలో పూజలు చేయనున్నారు. 10వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలో ఆయన ఏడు నిమిషాల పాటు గడుపుతారని, ఆ సమయంలోనే ప్రధాని ఆరోగ్యం బాగుండాలని, దేశంలో కరోనా వ్యాప్తి తగ్గాలని వేద మంత్రాలు చదువుతామని హనుమాన్ గడి ప్రధాన పురోహితుడు మహంతి రాజు దాస్ మీడియాకు తెలిపారు.

No comments